- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆపరేషన్ సిందూర్‌పై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వ్యాఖ్యలు వైరల్
ఆపరేషన్ సిందూర్ పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరికీ తెలియకుండానే ఆపరేషన్ సిందూర్ ఆగిపోయిందన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఆపరేషన్ సిందూర్ పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరికీ తెలియకుండానే ఆపరేషన్ సిందూర్ ఆగిపోయిందన్నారు. ట్రంప్ ట్విట్టర్ లో ట్వీట్ చేసేవరకు అంతా యుద్ధం కొనసాగుతోందని అనుకున్నారని చెప్పారు. పీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఆపరేషన్ సిందూర్ 2.o అంటూ పోస్టులు పెట్టడం ఆశ్యర్యం కలిగించిందన్నారు. ఢిల్లీ పేలుడు కేసు ఏమైందో ఎవరికీ తెలియదన్నారు. రోజు రోజుకు రూపాయి విలువ పడిపోతుందని మరో ఐదేళ్లు ఇలాగే జరిగితే పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు. మనం ఏమీ పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇక ఏపీలో చంద్రబాబు తనపై నమోదైన కేసులను కొట్టివేయించుకునే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పారు. అన్నింటినీ ఇన్ ఫ్లుయెన్స్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి నుండి తాను పార్టీ గురించి సామాజిక పరిస్థితుల గురించి తరచూ వీడియోలు చేస్తానని చెప్పారు.






