Kesineni: అన్నపై.. తమ్ముడు రూ.100 కోట్లకు పరువు నష్టం దావా

by Thanuru Gopichand |   (  Updated:2025-04-25 11:07:12  IST  )

నువ్వు 100 కోట్లకు కాదు లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారి పై నా పోరాటం ఆగదు'.

Kesineni: అన్నపై.. తమ్ముడు రూ.100 కోట్లకు పరువు నష్టం దావా
X

* కేశినేని నానికి లీగల్ నోటీసులు పంపించిన. తమ్ముడు చిన్ని

* లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసిle నా పోరాటం ఆగదు

* తమ్ముడు చిన్నికి అన్న నాని సవాల్

దిశ డైనమిక్ బ్యూరో: 'నువ్వు 100 కోట్లకు కాదు లక్ష కోట్లకు పరువు నష్టం దావా (Defamation lawsuit) వేసినా ప్రజల సంపద దోచుకునే వారి పై నా పోరాటం ఆగదు'.. అంటూ కేశినేని నాని (Kesineni Nani) హెచ్చరించారు. ఈరోజు ఆయన ట్వీట్ చేస్తూ.. తనకు తమ్ముడు కేసినేని చిన్ని (Chinni) పంపించిన పరువు నష్టం దావా లీగల్ నోటీసులను (Legel Notice) జత చేశారు. అన్న కేశినేని నానిపై తమ్ముడు కేశినేని చిన్ని రూ.100 కోట్ల (Hundred crores) పరువు నష్టం దావా వేశారు. ఇటీవల ఉర్సా (Ursa) సంస్థకి భూ కేటాయింపులపై సీఎం చంద్రబాబుకు కేశినేని నాని లేఖ రాశారు. ఉర్సా కంపెనీలో కేశినేని చిన్ని బినామీలదని నాని అందులో పేర్కొన్నారు. అవాస్తవాలతో తన పరువుకి నష్టం కలిగించారంటూ అన్న నానిపై చిన్ని పరువు నష్టం దావా వేశారు.

ఆయన పంపిన లీగల్ నోటీసులకు కేసినేని నాని స్పందిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ' విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) నుండి నాకు ఇప్పుడే లీగల్ నోటీసు అందింది, ఆయన పరువు నష్టం కోసం రూ. 100 కోట్లు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తాను రాసిన బహిరంగ లేఖలో తాను చట్టబద్ధమైన ప్రశ్నలు లేవనెత్తానని తెలిపారు. విజయవాడ ప్రజలకు 10 సంవత్సరాలు పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించే గౌరవం తనకు లభించింది అన్నారు. తాను పారదర్శకంగా నిజాయితీగా పని చేశానని తెలిపారు. ముఖ్యమంత్రికి తాను రాసిన లేఖలో ప్రతి మాటకు కట్టుబడి ఉన్నానని త తెలిపారు. నన్ను బెదిరించడానికి నా నోరు మూయించటానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. తాను వాస్తవాలతో స్పందిస్తానన్నార. నిజం బెదిరింపులకు భయపడదు. నేను కూడా భయపడను... అని ఆయన పోస్టులో పేర్కొన్నారు.

Next Story