- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YS Jagan: కేసీఆర్ రూ.616 కోట్లతో అద్భుతంగా కట్టాడు.. మీకెందుకు అంత ఖర్చు..?
హైదరాబాద్లో కేసీఆర్నాడు కేసీఆర్ గారు 8 లక్షల స్క్వేర్ ఫీట్లలో రూ.616 కోట్లతో అద్భుతమైన సెక్రటేరియట్ నిర్మించారు.

ఆ భవన నిర్మాణాలకు. రూ.600 కోట్లు వృధా కదా?
గతంలో అసెంబ్లీ, సచివాలయం కట్టారు..
ఇప్పుడు మళ్లీ కొత్త బిల్డింగులు ఎందుకు?
ప్రజలపై అప్పుల భారం మోపటం కాదా?
మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపణలు
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్లో కేసీఆర్నాడు కేసీఆర్ గారు 8 లక్షల స్క్వేర్ ఫీట్లలో రూ.616 కోట్లతో అద్భుతమైన సెక్రటేరియట్ నిర్మించారు.. చంద్రబాబు నాయుడు 53,57,000 స్క్వేర్ ఫీట్లలో సెక్రటేరియట్ నిర్మించడం ఏంటి ? అని వైసీపీ అధినేత వైఎస్జగన్ప్రశ్నించారు. అమరావతిలో 600 కోట్ల రూపాయలు ఖర్చు చేసి గతంలో అసెంబ్లీ, సచివాలయాలు (Assembly) భవనాలు కట్టి..ఇప్పుడు వాటిని వదిలేసి మళ్లీ అసెంబ్లీ సచివాలయాలు కడతానని చెప్పడం వృధా కాదా అని ప్రశ్నించారు. తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అంటూ అందరినీ మభ్యపెడుతున్నారని అన్నారు. అదే అమరావతి (Amaravathi) కోసం చేస్తున్న అప్పుడు ఇప్పుడు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆరోపించారు. చంద్రబాబు చేస్తున్న పనికి విజయవాడ గుంటూరులో రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్నారు. తమ ఐదేళ్ల పాలనలో 3,32,671 లక్షల కోట్లు అప్పు చేస్తే.. చంద్రబాబు నాయుడు (Chandrabau) 12 నెలల్లోనే 1,37,546 లక్షల కోట్లు అప్పు చేశారని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆరోపించారు.
మేం ఐదేళ్లలో చేసిన అప్పు.. బాబు ఏడాదిలోనే చేశారని అన్నారు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తానని చంద్రబాబు చెప్పాడని గుర్తు చేశారు. బాబు ఏడాది పాలనలో పెట్టుబడులు తగ్గాయి.. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందన్నారు. రాష్ట్ర ఖజానాకు ఆదాయం రావడంలేదని తెలిపారు. రాష్ట్ర ఆదాయమంతా గజదొంగల జేబుల్లోకి వెళుతుందని ఆరోపించారు. ఏపీఎండీసీకి గనులు తాకట్టుపెట్టి 9వేలకోట్లు చంద్రబాబు అప్పు చేశారని అన్నారు. 293 (1) ప్రకారం బాబు అప్పులు చేసే విధానం చట్ట విరుద్ధం అని తెలిపారు. ఏపీఎండీసీ భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టారని ఆరోపించారు. విద్యుత్ కొనుగోలులో రూ.11వేల కోట్ల స్కామ్ జరిగిందని అన్నారు. యాక్సిస్ సంస్థ నుంచి యూనిట్ కు రూ.4.60 చొప్పున కొన్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు దోచి పెట్టారని అన్నారు. 4 గంటల పీక్ అవర్ కోసం అంటూ..24 గంటలకు యూనిట్ కు రూ.4.60 చొప్పున కొనుగోలు చేశారు.మా హయాంలో సెకీతో విద్యుత్ ఒప్పందం చేసుకున్నాం.. మా హయాంలో యూనిట్ కు రూ.2.49లకే విద్యుత్ కొన్నాం.. విద్యుత్ కొనుగోలులో రాష్ట్ర ఆదాయం ఆదా చేశాం అని తెలిపారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మట్టి మాఫియా చెలరేగిపోతుందని అన్నారు. అమరావతి టెండర్ల పేరుతో మరో దోపిడీకి తెరS తీశారని అని ఆరోపించారు.






