వైజాగ్‌లో ఘనంగా కావడి యాత్ర

by Naga Rani Yarlagadda |

శ్రావణమాసం తొలి ఆదివారం సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించిన కావడి యాత్ర (Kavadi Yatra) ఘనంగా జరిగింది. ఇందులో నగరానికి చెందిన మార్వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వైజాగ్‌లో ఘనంగా కావడి యాత్ర
X

దిశ, వెబ్ డెస్క్: శ్రావణమాసం తొలి ఆదివారం సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించిన కావడి యాత్ర (Kavadi Yatra) ఘనంగా జరిగింది. ఇందులో నగరానికి చెందిన మార్వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాధవధార (Madhava Dhara) వద్ద ప్రారంభమైన కావడియాత్రలో సుమారు 1000 మందికి పైగా మార్వాడీలు పాల్గొన్నారు. మాధవధార, కంచరపాలెం, తాడిచెట్లపాలెం, అక్కయ్యపాలెం, గురుద్వారా, మద్దిలపాలెం మీదుగా బీచ్ రోడ్ వరకూ జరిగిన కావడియాత్రలో పిల్లలు, పెద్దలు, మహిళలు అంతా కాషాయ దుస్తులు ధరించి పాల్గొన్నారు. ప్రకృతి పట్ల మనకున్న నమ్మకాన్ని చూపించడం, కృతజ్ఞత తెలుపడమే ఈ యాత్ర లక్ష్యమని మార్వాడీలు పేర్కొన్నారు.

Next Story