Vijay Sai Reddy : లిక్కర్ స్కాంలో కసిరెడ్డిదే మెయిన్ రోల్ : విజయసాయి రెడ్డి

by Muthe.Rajitha |

ఏపీ లిక్కర్ స్కాం(AP Liquor Scam)లో మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి(Vijaya Sai Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Vijay Sai Reddy : లిక్కర్ స్కాంలో కసిరెడ్డిదే మెయిన్ రోల్ : విజయసాయి రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ లిక్కర్ స్కాం(AP Liquer Scam)లో మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి(Vijaya Sai Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం కేసులో నేడు సిట్ విచారణ(SIT Enquiry)కు హాజరైన విజయసాయి రెడ్డి.. లిక్కర్ స్కాంలో కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ స్కాంలో సాక్షిగా హాజరు కావాలని సిట్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేయగా.. నేడు సిట్ ముందుకు వచ్చారు. శుక్రవారం విజయవాడ సిట్ ఆఫీసులో ఈ విచారణ జరుగుతోంది. ఈ కుంభకోణంలో మెయిన్ రోల్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిదే అని విజయసాయి పేర్కొనగా.. అదే ఆఫీసులో వేరేచోట విచారణ జరుపుతున్న కసిరెడ్డి తండ్రిని విజయసాయి సమాధానాలను బేస్ చేసుకొని ప్రశ్నలు ఆడుగుతున్నట్టు సమాచారం.కాగా విచారణ సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Next Story