చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు కర్ణాటక మంత్రి కౌంటర్

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-28 16:36:13  IST  )

ఇండియాలోనే మొదటి క్వాంటమ్ కంప్యూటర్(Quantum Computing) అమరావతిలో నిర్మిస్తున్నామని సోషల్ మీడియా వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) ప్రకటించిన విషయం తెలిసిందే.

చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు కర్ణాటక మంత్రి కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలోనే మొదటి క్వాంటమ్ కంప్యూటర్(Quantum Computing) అమరావతిలో నిర్మిస్తున్నామని సోషల్ మీడియా వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా చంద్రబాబు ట్వీట్‌కు కర్ణాటక సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఎన్.ఎస్.బోస్ రాజు(N.S. Bose Raju) స్పందించారు. ఈ మేరకు ఆయన కౌంటర్ ట్వీట్ పెట్టారు. ఇండియాలో మొదటి క్వాంటమ్ కంప్యూటర్ బెంగుళూరులో నిర్మించామని, ఏప్రిల్ - 2025 నుండి ఆ కంప్యూటర్ సేవలు వినియోగిస్తున్నామని తెలిపారు. వాస్తవాలు మాట్లాడుకుంటూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుదామంటూ చంద్రబాబుకు కర్ణాటక మంత్రి సూచించారు. ఇండస్ అని పేరుతో బెంగళూరుకు చెందిన QpiAI నిర్మించిన 25-క్విట్ క్వాంటం కంప్యూటర్ ఏప్రిల్ 2025 నుండి సేవలను అందిస్తోంది. ఇండస్ అని పిలువబడే ఈ 25-క్విట్ క్వాంటం కంప్యూటర్ ఇప్పటికే ఆరోగ్య సంరక్షణ, రక్షణ, అధునాతన పరిశోధన, ఫైనాన్స్ ఇతర రంగాలలో కూడా ప్రపంచ సేవలను అందిస్తోంది అని బోస్ అన్నారు.

Next Story