- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నవోదయలో మెరిసిన కంబదూరు విద్యార్థి
కంబదూరుకు చెందిన వడ్డే మారుతి ప్రసాద్ కుమారుడు వడ్డే తరుణ్ తేజ్ నవోదయ ప్రవేశ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు...

దిశ, కళ్యాణదుర్గం: కంబదూరుకు చెందిన వడ్డే మారుతి ప్రసాద్ కుమారుడు వడ్డే తరుణ్ తేజ్ నవోదయ ప్రవేశ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఇటీవల నిర్వహించిన ఈ పరీక్షల్లో 90 మార్కులు సాధించి, రాష్ట్ర స్థాయిలో 00121 ర్యాంక్‌ను పొందడం ద్వారా తన ప్రతిభను చాటుకున్నారు. ప్రస్తుతం మారుతి విద్యామందిర్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న తరుణ్ తేజ్, చిన్న వయస్సులోనే కృషి, పట్టుదలతో ఈ విజయాన్ని సాధించడం విశేషం. క్రమశిక్షణతో చదువుతూ లక్ష్యాన్ని సాధించాలనే దీక్షతో ముందుకు సాగిన అతని ప్రతిభకు ఉపాధ్యాయులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థి విజయంపై పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం వల్లే ఈ ఫలితం సాధ్యమైందని వారు పేర్కొన్నారు. స్థానికులు, మిత్రులు కూడా తరుణ్ తేజ్‌ను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.






