- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Chandrababu:స్త్రీల ఆత్మగౌరవాన్ని చాటిన కలియుగ పార్వతీదేవీ వాసవీమాత
ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఇవాళ(శుక్రవారం) పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District) పెనుగొండలో పర్యటిస్తున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఇవాళ(శుక్రవారం) పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District) పెనుగొండలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద సీఎం చంద్రబాబుకు, మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu), ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి(Vasavi Kanyaka Parameswari) ఆలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు ఆలయ ప్రధానార్చకులు, అధికారులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అయితే వాసవీ కన్యకా పరమేశ్వరి(Vasavi Kanyaka Parameswari) ఆత్మార్పణ రోజూ సందర్భంగా ఇక్కడి ఆలయంలో అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం(AP Government) తరఫున పట్టు వస్త్రాలను సీఎం చంద్రబాబు సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు సమాజం పట్ల అత్యంత బాధ్యత గల వ్యక్తులు ఆర్య వైశ్యులు అని పేర్కొన్నారు.
బెంగళూరు(Bengaluru)లో ఉన్న వారు ఇక్కడ ఆలయాలు నిర్మించారంటే అది అమ్మవారి మహిమ అని తెలిపారు. వాసవీ అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. స్త్రీల ఆత్మగౌరవాన్ని చాటిన కలియుగ పార్వతీదేవి వాసవీమాత అని పేర్కొన్నారు. అమ్మను వేడుకుంటే శాంతి, సంపద, రక్షణ, ఆశీస్సులు మెండుగా లభిస్తాయన్నారు. ఆర్యవైశ్యుల పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న పెనుగొండలో కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.






