టీడీపీకి పిల్లి సత్తిబాబు రాజీనామా.. సీఎం చంద్రబాబుకు లేఖ

by Vemula.Srinu Prasad |

కాకినాడ రూరల్ టీడీపీకి బిగ్ షాక్ తగిలింది...

టీడీపీకి పిల్లి సత్తిబాబు రాజీనామా.. సీఎం చంద్రబాబుకు లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ రూరల్ టీడీపీ(TDP)కి బిగ్ షాక్ తగిలింది. కోఆర్డినేటర్ సత్తిబాబు రాజీనామా చేశారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు ఆయన లేఖ రాశారు. తన రాజీనామాకు గత కారణాలను వివరించారు. దీంతో ఒక్కసారిగా కాకినాడ రూరల్ టీడీపీ(Tdp)లో ఏం జరుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది.

కాగా కాకినాడ రూరల్‌(Kakinada Rural)లో పంతం నానాజీ(Pantham Nanaji) జనసేన(Janasena) ఎమ్మెల్యేగా ఉన్నారు. గత కొంతకాలంగా ఇక్కడ కూటమిలో వర్గవిభేదాలు ఉన్నాయి. జనసేన నాయకులు టీడీపీ నేతలకు, కార్యకర్తలకు విలువ ఇవ్వడంలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో జనసేన నాయకులు వ్యవహరిస్తున్న తీరును ఇప్పటికే పార్టీ అధిష్టానం దృష్టికి నాలుగుసార్లు తీసుకెళ్లారు. అయినా ఉపయోగం లేకపోవడంతో సత్తిబాబు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

Next Story