- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ap News: కాకినాడ పోర్టు వాటాల బదిలాయింపు కేసులో కీలక పరిణామం

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ పోర్టు వాటాల బదిలాయింపు కేసు(Kakinada port share transfer case)లో కీలక పరిణామం చేసుకుంది. ఈ కేసు నిందితుడు వైసీపీ నేత విక్రాంత్ రెడ్డి(YCP leader Vikrant Reddy) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు(High Court)లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీఐడీ అధికారులు(CID officials) కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. వాటాలను బలవంతంగా తీసుకోవడానికి విక్రాంత్ రెడ్డినే కీలక పాత్ర పోషించినట్లు కౌంటర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. విక్రాంత్ రెడ్డి కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని తెలిపారు. విక్రాంత్ రెడ్డి తండ్రి వైసీపీ రాజ్యసభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YCP Parliament Member YV Subbareddy) అని కోర్టు దృష్టి తీసుకెళ్లారు. విక్రాంత్ రెడ్డికి బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరించడంతో పాటు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, ఆయన దాఖలు చేసిన చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని కోర్టును సీఐడీ అధికారులు కోరారు.