పిఠాపురం శాశ్వత ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌..!

by Vemula.Srinu Prasad |

పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గ శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉంటార‌ని, ఆయ‌న చేస్తున్న అభివృద్దే అందుకు తార్కాణ‌మ‌ని, కాకినాడ ఎంపీ ఉద‌య్ శ్రీనివాస్ అన్నారు. ...

పిఠాపురం శాశ్వత ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌..!
X

దిశ‌, పిఠాపురం: పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గ శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉంటార‌ని, ఆయ‌న చేస్తున్న అభివృద్దే అందుకు తార్కాణ‌మ‌ని కాకినాడ ఎంపీ ఉద‌య్ శ్రీనివాస్ అన్నారు. శ‌నివారం పిఠాపురంలో జ‌న‌సేన 13వ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌ను పార్టీ శ్రేణులు ఘ‌నంగా నిర్వ‌హించారు. స్థానిక ఉప్పాడ బ‌స్టాండు వ‌ద్ద కేక్ క‌ట్ చేసి, సంబ‌రాలు చేశారు. అనంత‌రం వ‌క్తలు మాట్లాడారు.

ఈ సందర్భంగా జనసేన జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ "పవన్ కళ్యాణ్ పిఠాపురానికి ఎంతో సేవ చేస్తున్నార‌న్నారు. ఇక్కడి ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు" అని ఆయ‌న స్పష్టం చేశారు.

కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ "పిఠాపురంలో ఇప్పటికే 60,000 మందితో జనసేన ఒక పెద్ద కుటుంబంగా మారింది. త్వరలోనే లక్ష సభ్యత్వాల మార్కును చేరుకుంటాం. పవన్ కళ్యాణ్ కేవలం రాష్ట్ర స్థాయి నేత మాత్రమే కాదు, దేశ స్థాయి నాయకుడిగా ఎదిగారు" అని కొనియాడారు.


స్థానిక ఉప్పాడ బస్టాండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ వేదికపై జనసేన నేతలు ఆధ్వర్యంలో భారీ కేక్‌ను కట్ చేశారు. అనంతరం పిఠాపురం నుంచి గొల్లప్రోలు వరకు జనసైనికులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. గొల్లప్రోలులో భారీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేసి జనసేన నాయకులు తమ సేవా నిరతిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్, పిఠాపురం, గొల్లప్రోలు, కొత్త‌ప‌ల్లి మండల, పట్టణ నాయ‌కులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story