- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ సభలో ప్లకార్డులు..48గంటల్లోనే మిస్సింగ్ కేసు ఛేదించిన పోలీసులు
ఇటీవల పవన్ కల్యాణ్ సభలో తమ కూతురు కనిపించడం లేదంటూ ఓ మార్వాడి కుటుంబం పవన్ కల్యాణ్ సభలో ప్లకార్డులు ప్రదర్శించిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల పవన్ కల్యాణ్ సభలో తమ కూతురు కనిపించడం లేదంటూ ఓ మార్వాడి కుటుంబం పవన్ కల్యాణ్ సభలో ప్లకార్డులు ప్రదర్శించిన సంగతి తెలిసిందే. కాకినాడ జిల్లా కరప గ్రామంలో స్థిరపడిన మార్వాడీ కుటుంబం తమ కూతురు మిస్సింగ్ అని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నెల 8వ తేదీ నుండి బాలిక కనిపించడం లేదని ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేసింది. కాగా పవన్ కల్యాణ్ దృష్టికి ఈ విషయం చేరడంతో పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. మిస్సింగ్ కేసును ఛేదించి బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో నిరసనలు తెలిపితే గానీ పోలీసులు కేసులను పట్టించుకోరా అంటూ విమర్శలు వస్తున్నాయి. బాలిక మిస్ అయ్యి ఇరవై రోజులు అయినా పట్టించుకోకుండా డిప్యూటీ సీఎం దృష్టికి వెళ్లడంతో 48గంటల్లోనే పట్టుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.






