Kakani Govardhan: కాకాణి జంప్.. ఈ రోజు విచారణకు డుమ్మా

by Thanuru Gopichand |

విచారణకు హాజరు కాకుండా మాజీ మంత్రి కాకాణి తప్పించుకుంటున్నారా..? తాజా పరిణామాలు అదే సూచిస్తున్నాయి.

Kakani Govardhan: కాకాణి జంప్.. ఈ రోజు విచారణకు డుమ్మా
X

దిశ, డైనమిక్ ​బ్యూరో : విచారణకు హాజరు కాకుండా మాజీ మంత్రి కాకాణి (kakani govardhan) తప్పించుకుంటున్నారా..? తాజా పరిణామాలు అదే సూచిస్తున్నాయి. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని రుస్తుం మైన్స్‌లో అక్రమంగా క్వార్ట్జ్‌ ఖనిజం తవ్వుకున్నారనే కేసులో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్​నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులకు ఆయనకు నిన్న నోటీసులు ఇవ్వడానికి వెళితే అందుబాటులో లేరు. దీంతో ఆ నోటీసులు ఇంటి ప్రధాన గేటుకు నోటీసులు అంటించారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు (interrogation) హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే ఆయన విచారణకు హాజరు కాలేదు. అయితే ఆయన నిన్న ఉగాది పర్వదినాన్ని హైదరాబాద్​లో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకొన్నట్లు తెలుస్తోంది. మనమడికి ఉగాది పచ్చడి తినిపిస్తున్న ఫొటోలు సోషల్​మీడియాలో వచ్చాయి. దీంతో పోలీసులు హైదరాబాద్​లోని ఆయన నివాసానికి ఈ రోజు వెళ్లారు. మరోసారి నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11గంటలకు విచారణకు హాజరుకావాలని కోరారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముందస్తు బెయిల్ కోసం కాకణి గోవర్దన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ విచారణ కూడా మంగళవారం నాటికి వాయిదా వేసింది. ఈ క్రమంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. రేపు ఆయన విచారణకు హాజరు అవుతారా లేదా చూడాలి.

Next Story