గతంలో Chandrababu Naidu జేబులు కొట్టేవాడు: Kakani Govardhan Reddy

by Seetharam |   (  Updated:2022-09-08 18:05:15  IST  )

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేశ్‌లపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థనరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

గతంలో Chandrababu Naidu జేబులు కొట్టేవాడు: Kakani Govardhan Reddy
X

దిశ, ఏపీ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేశ్‌లపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థనరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. లోకేశ్‌ తలపై రుపాయి పెడితే పావలాకు పనికిరాడంటూ ఘాటు విమర్శలు చేశారు. తన తండ్రి, తాతల చరిత్ర ఏంటో లోకేశ్‌ తెలుసుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడు రైతుల పొలాల్లో రాత్రిళ్లు వేరుశెనగ బస్తాలు ఎత్తెకెళ్లేవాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో చంద్రబాబు జేబులు కొట్టేవాడని.. అది అందరికీ తెలుసని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకే‌శ్‌ అఖిల భారత దరిద్ర సంఘానికి అధ్యక్ష, కార్యదర్శులుగా తయారయ్యారని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్రంలో చంద్రబాబు జన్మించడమే పెద్ద శాపమని ధ్వజమెత్తారు.

'అసలు లోకేష్ అనేవాడు ఎవరు, ఎక్కడ గెలిచాడు, ఏ ప్రజా ఉద్యమాల నుంచి వచ్చాడు. వార్డు మెంబరుగా కూడా గెలవనటువంటి వాడు నెల్లూరు వచ్చి, ముఖ్యమంత్రిని, మంత్రిని, స్థానిక ఎమ్మెల్యేలపై నోటికొచ్చినట్లు మాట్లాడతాడా?.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా లోకేశ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని, నోరు అదుపులో పెట్టుకోవాలి.. ఫేక్ వ్యక్తులు ఎవరో రాష్ట్ర ప్రజలకు, సమాజానికి బాగా తెలుసు. చంద్రబాబు కుటుంబానికి ఉన్న క్రెడిబులిటీ ఏమిటో, క్యారెక్టర్ ఏమిటో అందరికీ తెలుసు. అటువంటి వీళ్ళు సీఎం జగన్‌ కుటుంబం గురించి మాట్లాడటానికి అర్హత ఎక్కడిది. మీ మాదిరిగా మేమూ మాట్లాడితే.. మీ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు' అని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ప్రశ్నించారు.

Next Story