రైస్ పుల్లింగ్ మోసం.. వైసీపీ నేత అరెస్ట్

by Naga Rani Yarlagadda |

రైస్ పుల్లింగ్ మోసం కేసులో కదిరి మండల వైసీపీ ఇన్ఛార్జ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

రైస్ పుల్లింగ్ మోసం.. వైసీపీ నేత అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: రైస్ పుల్లింగ్ మోసం కేసులో వైసీపీ నేత కృష్ణారెడ్డి అరెస్టయ్యారు. మహిమగల రాగి చెంబు అని చెప్పి వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తికి టోకరా వేశారు. రూ.2 కోట్ల విలువైన రాగి చెంబును తక్కువకే ఇస్తున్నానని చెప్పి రూ.10 లక్షలు వసూలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలం వైసీపీ కన్వీనర్ చింతగుంట కృష్ణారెడ్డి అలియాస్ డీకే బాబు అలియాస్ డిక్కీ బాబు మోసం చేశారు. రాగి చెంబు మహిమగలదని కాదని గుర్తించిన వేణుగోపాల్ తన డబ్బు తనకు ఇవ్వాలని అడగ్గా రివర్స్ లో బెదిరించారంటూ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగుచూసింది. దీంతో అతన్ని అరెస్ట్ చేసి విలువైన కార్లు, లక్షరూపాయల నగదు, ఐదు రాగిచెంబులు స్వాధీనం చేసుకున్నారు. ఏదైనా వస్తువులో అద్భుతమైన శక్తులున్నాయని నమ్మించి అందికాడిక డబ్బుల్ని దండుకోవడమే రైస్ పుల్లింగ్ మోసం అంటారు. ముఖ్యంగా రాగిచెంబులు, గిన్నెలు, నాణెలను చూపించి వాటికి అమితమైన శక్తి ఉందని నమ్మబలుకుతారు.

Next Story