కడప | కలెక్టరును కలిసిన యురేనియం బాధిత గ్రామస్తులు

by Thanuru Gopichand |

కడప జిల్లా పరిధిలోని యురేనియం బాధిత గ్రామ ప్రజలు (Uranium Effected Villagers) తమ గోడును వెల్లబోసుకుంటున్నారు.

కడప | కలెక్టరును కలిసిన యురేనియం బాధిత గ్రామస్తులు
X

దిశ, వెబ్ డెస్క్ : కడప జిల్లా పరిధిలోని యురేనియం బాధిత గ్రామ ప్రజలు (Uranium Effected Villagers) తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. ఈ మేరకు టీడీపీ నేత బీటెక్ రవి (TDP Leader Btech Ravi) ఆధ్వర్యంలో కడప జిల్లా కలెక్టరును కేకే కొట్టాల ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు. టెయిల్ పాండ్ వద్ద పర్యావరణం దెబ్బతింటోందన్నారు. పంటలు, త్రాగునీరు కలుషితం కావడంతో జబ్బులు వస్తున్నాయని చెబుతున్నారు. గ్రామస్తుల ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ శ్రీధర్ యూసీఐఎల్ అధికారులను (UCIL Officials) పిలిపించారు. వారి వద్దే బాధిత గ్రామస్తుల ఆవేదనను కలెక్టర్ విన్నారు.

వివరాల్లోకి వెళ్తే..

2007 సంవత్సరంలో పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలం తుమ్మలపల్లి , మబ్బు చింతలపల్లి, కె.కె. కొటాల, రాచుకుంటపల్లి, భూమయ్య గారి పల్లి, మీది పెంట గ్రామాలకు సంబంధించిన భూములలో యురేనియం కర్మాగారాన్ని ప్రారంభించారు. యురేనియం వల్ల వచ్చే కాలుష్యం రైతన్నలకు శాపంగా మారింది. యురేనియం పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాల వల్ల ప్రజలు, పశువులు చర్మ వ్యాధి బారిన పడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. వ్యర్థ పదార్థాల వచ్చే పైపులు లీకేజ్‌ కావడం వల్ల కాలుష్యం ఎక్కువై పంటలపై ప్రభావం చూపి పంటలు పండకుండా పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నామ మాత్రంగా మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్న పరిస్థితి నెలకొందని ఆయా గ్రామస్తులవారు ఆరోపిస్తున్నారు. కలుషిత నీటితో పంట దిగుబడులు తగ్గడమే కాకుండా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని.. ఈ విషయమై పలుమార్లు యూసిఐఎల్‌ ఆధికారులతో పాటు సంబంధిత అధికారులకు విన్నవించినా ఫలితం లేదని రైతులు, స్థానికులు ఆవేదన చెందుతున్నారు. పరిశ్రమను ఏర్పాటు చేసిన ప్రారంభంలో పరిసర గ్రామాల ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తామన్న హామీ విస్మరించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముడి యురేనియాన్ని శుద్ధిచేసిన తర్వాత వచ్చే వ్యర్థాలను కనం కిందకొట్టాల సమీపంలో నిర్మించిన టెయిల్‌ఫాండ్‌లో నింపుతున్నారు. దీంతో వ్యర్థాలు భూగర్భంలోకి వెళ్లి వ్యవసాయ గొట్టపుబావుల్లోకి చేరి భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ఆరోపిస్తున్నారు.

Next Story