Video: మోడీని ఇమిటేట్ చేసిన కేఏ పాల్..అమరావతి పర్యటనపై సెటైర్లు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-05 13:03:16  IST  )

ప్ర‌ధాని మోడీ అమ‌రావ‌తి ప‌ర్య‌ట‌న‌పై ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సెట్లైర్లు వేశారు. మోడీని ఇమిటేట్ చేసి మాట్లాడిన వీడియోను పాల్ విడుద‌ల చేశారు.

Video: మోడీని ఇమిటేట్ చేసిన కేఏ పాల్..అమరావతి పర్యటనపై సెటైర్లు
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్ర‌ధాని మోడీ అమ‌రావ‌తి ప‌ర్య‌ట‌న‌పై ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సెట్లైర్లు వేశారు. మోడీని ఇమిటేట్ చేసి మాట్లాడిన వీడియోను పాల్ విడుద‌ల చేశారు. వీడియోలో ఆయ‌న మాట్లాడుతూ... మోడీ అధికారంలోకి వ‌చ్చేంత‌వ‌ర‌కు స్పెష‌ల్ స్టేట‌స్ ఇస్తామ‌ని చెప్పారన్నారు. స్మార్ట్ సిటీలు క‌డ‌తాన‌ని, న‌ల్ల‌ధ‌నం తీసుకువ‌స్తాను, డాల‌ర్ రూపాయితో స‌మానం చేస్తాను, 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన‌ని చెప్పాడ‌ని చెప్పార‌ని అన్నారు.

2014లో అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు అమరావ‌తిలో మ‌ట్టి దీపం ఇచ్చార‌ని, ఇప్పుడు వ‌చ్చిన‌ప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కు చాక్లెట్ ఇచ్చాడ‌ని అన్నారు. అప్పులు మనం చేసి రాజధాని కట్టుకోవాలని అంటున్నాడని, మన డబ్బును లక్షల కోట్లను గుజరాత్ వాళ్లకు అప్పజెపుతున్నారని విమర్శలు కురిపించారు. ఇప్పటికైనా ప్రజలకు బుద్ధి రావాలని అన్నారు. మార్పు రావాలి, మనకు మోడీ వద్దు మోడీ తొత్తులు వద్దు అనేవారు వీడియోను షేర్ చేయాలని చెప్పారు. ఇదిలా ఉంటే కేఏ పాల్ ప్రస్తుతం రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నారు. ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా తరచూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

Next Story