బాలయ్య కడుపు చేస్తానంటే ఏం చేశారు? మహిళా కమిషన్‌పై కేఏ పాల్ సీరియస్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-28 05:59:40  IST  )

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శివాజీ మహిళల వస్త్రాదరణపై చేసిన కామెంట్లపై మహిళా కమిషన్ సీరియస్ అయిందని చెప్పారు.

బాలయ్య కడుపు చేస్తానంటే ఏం చేశారు? మహిళా కమిషన్‌పై  కేఏ పాల్ సీరియస్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శివాజీ మహిళల వస్త్రాదరణపై చేసిన కామెంట్లపై మహిళా కమిషన్ సీరియస్ అయిందని చెప్పారు. ఆయనకు సమన్లు జారీ చేస్తే వెళ్లి క్షమాపణలు కూడా చెప్పాడని అన్నారు. ఆయన కావాలని ఆ వ్యాఖ్యలు చేశాడని తాను అనుకోవడం లేదన్నారు. కానీ ఆయనను విచారణకు పిలవడాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. మరి న‌టుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ మ‌హిళ‌ల గురించి కామెంట్స్ చేసిన‌ప్పుడు మ‌హిళా క‌మిష‌న్ ఏం చేసింద‌ని ప్ర‌శ్నించారు. ఫ్యాన్స్ అడిగితే అమ్మాయిల‌కు ముద్దు అయినా పెట్టాలి క‌డుపైనా చేయాలి అని నేష‌న‌ల్ ప్లాట్ ఫామ్ పై మాట్లాడాడ‌ని మ‌రి అప్పుడు మ‌హిళా క‌మిష‌న్ ఎక్క‌డ పోయింద‌ని ప్ర‌శ్నించాడు.

నేష‌న‌ల్ ఉమెన్ క‌మిష‌న్ ఏమైంద‌ని అన్నాడు. ఆయ‌న‌కు ప‌ద్మ‌భూష‌ణ్ ఇచ్చార‌ని, వ‌చ్చే ఏడాది భార‌త ర‌త్న కూడా ఇస్తార‌న్నాడు. యూపీలో మాజీ బీజేపీ ఎమ్మెల్యే మైన‌ర్ ను అత్యాచారం చేస్తే ఆయ‌న‌కు కోర్టులో బెయిల్ ఇచ్చార‌ని మండిప‌డ్డాడు. బాధితురాలు త‌న‌కు ముప్పు ఉంద‌ని చెప్పినా నిందితుడిని వ‌దిలిపెట్టార‌న్నారని చెప్పారు. బీజేపీని ప్ర‌శ్నించి కాంగ్రెస్ ను ప్ర‌శంసించినందుకే శివాజీని టార్గెట్ చేస్తున్నార‌ని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరితే ఎన్ని కేసులు ఉన్నా తొల‌గిపోతాయ‌ని చెప్పారు. దేశంలో ఛ‌త్తీస్ గడ్ స‌హా ప‌లు రాష్ట్రాల్లో చ‌ర్చిల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌ని అలా జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. దేశాన్ని కాపాడాల‌ని అన్నారు.

Read More..

ఇండస్ట్రీలో హీరోయిన్లనే కాదు హీరోలను కూడా నలిపేస్తారు.. శివాజీకి ఇచ్చిపడేసిన పూరీ జగన్నాథ్

Next Story