- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందరి సపోర్ట్‌తో నిమిష ప్రియను విడిపిస్తున్నా: కేఏ పాల్
నిమిష ప్రియ విడుదల అవుతుండటం సంతోషంగా ఉందని కేఏ పాల్ అన్నారు. అందరి ప్రార్థనల వల్ల నిమిష ప్రియ తిరిగి ఇంటికి రావాలని, అన్ని పనులు మానుకుని టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్నానని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: నిమిష ప్రియ విడుదల అవుతుండటం సంతోషంగా ఉందని కేఏ పాల్ అన్నారు. అందరి ప్రార్థనల వల్ల నిమిష ప్రియ తిరిగి ఇంటికి రావాలని, అన్ని పనులు మానుకుని టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్నానని చెప్పారు. బాధిత కుటుంబంలో ఒక్కరు తప్ప మిగితావాళ్లంతా నిమిష ప్రియను వదిలిపెట్టేందుకు అంగీకరించారని అన్నారు. దేవుడి దయ వల్ల హూతీ దేశ ప్రభుత్వ పెద్దలను, బాధిత కుటుంబాన్ని ఒప్పించగలిగామని అన్నారు. మంచి జరిగిందని తాను ఇస్తాంబుల్ లో హుతీ నాయకులతో మాట్లాడి అందరినీ ఒప్పించానని చెప్పారు. ఏడు రోజులుగా ఇస్తాంబుల్ లోనే ఉన్నానని నిమిష ప్రియను విడిపించాలని ప్రజలంతా కోరారని అన్నారు. అతి త్వరలోనే ఆమె విడుదల అవుతుందని తెలిపారు. వీలైతే నిమిష ప్రియను తన వెంటే ఇండియాకు తీసుకువస్తామని అన్నారు. ప్రధాని మోడీ ట్వీట్ చేసినా చేయకపోయినా, జయశంకర్ ట్వీట్ చేసినా చేయకపోయినా ప్రజల మద్దతుతో నిమిష ప్రియను విడిపిస్తున్నామని చెప్పారు.






