బాలకృష్ణ, పవన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదా? కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్

by Ajay Maddhiboyina |

పవన్ కల్యాణ్, బాలకృష్ణ‌ల‌పై ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌, జ‌న‌సేన నేత డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్, వాళ్ల సోద‌రులు బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోట్ చేయ‌లేదా అని ప్ర‌శ్నించారు.

బాలకృష్ణ, పవన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదా? కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్
X

దిశ‌, వెబ్ డెస్క్: పవన్ కల్యాణ్, బాలకృష్ణ‌ల‌పై ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌, జ‌న‌సేన నేత డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్, వాళ్ల సోద‌రులు బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోట్ చేయ‌లేదా అని ప్ర‌శ్నించారు. వాళ్ల‌ను విచారించాల‌ని డిమాండ్ చేశారు. బీజేపీతో పొత్తుపెట్టుకుంటే వాళ్ల‌పై విచార‌ణ జ‌ర‌ప‌రా? అని ప్ర‌శ్నించారు.

వాళ్ల‌పై ఈడీ రైడ్స్ ఉండ‌వు, సీబీఐ రైడ్స్ ఉండ‌వు, ఐటీ రైడ్స్ ఉండ‌వా అని అడిగారు. మీకు ప‌ద్మ‌భూష‌ణ్‌లు ఇస్తారు, చాలా క్లీన్‌గా కాపాడతారని అన్నారు. ఎంత దౌర్జన్యం, ఎంత అవినీతి ఆకాశాన్ని అంటుకుందో అంటూ మండిపడ్డారు. ఇదిలా ఉంటే కేఏ పాల్ ప్ర‌స్తుతం ఇండియాలోనే ఉంటూ రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. గతంలో ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఆయనకు డిపాజిట్లు కూడా దక్కలేదు. అయినప్పటికీ అలుపెరగని యోధుడిలా ముందుకు వెళుతున్నారు.

Next Story