ఏపీ డీజీపీ కార్యాలయం వద్ద Ka Paul హల్‌ చల్

by Vemula.Srinu Prasad |   (  Updated:2022-12-30 14:07:42  IST  )

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ కందుకూరు తొక్కిసలాట ఘటనపై కదం తొక్కుతున్నారు. ప్రమాదం జరిగిన మరుసటి రోజే ఘటనా స్థలాన్ని పరిశీలించి కేఏపాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు..

ఏపీ డీజీపీ కార్యాలయం వద్ద Ka Paul హల్‌ చల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ కందుకూరు తొక్కిసలాట ఘటనపై కదం తొక్కుతున్నారు. ప్రమాదం జరిగిన మరుసటి రోజే ఘటనా స్థలాన్ని పరిశీలించి కేఏపాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకాదు కందుకూరు టౌన్ పీఎస్‌లో చంద్రబాబు నాయుడుపై ఫిర్యాదు సైతం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయాలని కోరారు. అంతేకాదు 8 మంది ప్రాణాలను బలితీసుకున్నందుకు చంద్రబాబు రాజకీయ సన్యాసం చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజగా శుక్రవారం మరోసారి కేఏపాల్ చంద్రబాబు నాయుడుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కందుకూరు ఘటనపై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు మంగళగిరికి వెళ్లారు.

మంగళగిరి డీజీపీ కార్యాలయానికి చేరుకున్న కేఏ పాల్‌ను లోపలికి వెళ్లనీయకుండా గేటు వద్ద అడ్డుకున్నారు. దీంతో కేఏ పాల్‌కు పోలీసులకు మధ్యకాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. కారు లోపలికి అనుమతించకపోవడంతో కాసేపు డీజీపీ కార్యాలయం ఎదుట హల్‌చల్ చేశారు. డీజీపీ కార్యాయలం బయటే కేఏపాల్ మీడియాతో మాట్లాడారు. డీజీపీ కార్యాలయం బయటే చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజలు చనిపోయినా సభలకు అనుమతి ఇవ్వడం దుర్మార్గమంటూ కేఏ పాల్ మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని విమర్శించారు. చంద్రబాబుపై డీజీపీ చర్యలు తీసుకోవాలని, తీసుకోకపోతే హైకోర్టును ఆశ్రయిస్తానని కేఏ పాల్ హెచ్చరించారు.

Next Story