- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతు కుటుంబాలకు న్యాయం చేయాలి.. సీఎంకు ఎమ్మెల్యే భాష్యం వినతి
రాజధాని విస్తరణలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు వెళ్లనున్న గ్రామాల్లోని రైతు కుటుంబాలకు న్యాయం చేయాలని పెదకూరపాడు ఎమ్మెల్యే (Pedakurapadu MLA) కోరారు

X
దిశ, వెబ్ డెస్క్ : రాజధాని విస్తరణలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు వెళ్లనున్న గ్రామాల్లోని రైతు కుటుంబాలకు న్యాయం చేయాలని పెదకూరపాడు ఎమ్మెల్యే (Pedakurapadu MLA) భాష్యం ప్రవీణ్ కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడును (CM Chandra Babu Naidu) మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. రాజధాని అమరావతి విస్తరణలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు వెళ్ళు గ్రామాలైన అమరావతి మండలంలోని లింగాపురం, ధరణికోట, పెదకూరపాడు మండలం బలుసుపాడు, కంభంపాడు, ఇతర గ్రామాలకు సంబంధించిన రైతు కుటుంబాలు (Farmer Families) భూములను నష్టపోతున్నాయన్నారు. ఆయా కుటుంబాల వారికి ప్రభుత్వం తరపున భరోసా కల్పించాలన్నారు. అదే విధంగా నష్టానికి అనుగుణంగా పరిహారాన్ని చెల్లించి న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడుకు పెదకూరపాడు నియోజకవర్గ ప్రజల తరపున కోరారు.
Next Story






