- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంగ్లీష్ మాట్లాడితేనే గొప్పకాదు : జస్టిస్ ఎన్వీ రమణ
ఇంగ్లీష్ మాట్లాడితేనే గొప్ప కాదని, మన భాషను మనమే తక్కువ చేసుకుంటున్నామని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లీష్ మాట్లాడితేనే గొప్ప కాదని, మన భాషను మనమే తక్కువ చేసుకుంటున్నామని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. గుంటూరులో జరుగుతున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో సోమవారం పాల్గొన్న ఆయన.. తెలుగుభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మాతృభాష పరిరక్షణ కోసం దీర్ఘకాలం పోరాటం చేయాలని సూచించారు. ఈ ఉద్యమంలో పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం సమాజంలో ఇంగ్లీష్ మాట్లాడితేనే గొప్ప అనుకునే పరిస్థితి ఉందన్నారు. ఇందుకు కారణం మన విద్యావిధానమేనని, మన సాహిత్యాన్ని మనమే చిన్నచూపు చూస్తున్నామన్నారు. సంస్కృతి, చరిత్ర, నాగరికతను మనమే బలోపేతం చేసుకోవాలని సూచించారు. మాతృభాష అంతరించిపోతే ఆ జాతి అంతరించిపోతున్నట్లేనన్న విషయం అందరూ గ్రహించాలని హితవు పలికారు. మాతృభాష రాకపోతే మన పద్యం, గేయం, సాహిత్యాన్ని ఆస్వాదించలేమన్నారు. సామెతలు, చతురోక్తులను మరచిపోకూడదని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలు తమ భాషలోనే పనులు చేసుకుంటున్నాయని, చైనా, రష్యా, జపాన్, జర్మనీ వంటి దేశాలు ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. తెలుగులో చదువుకున్న విద్యార్థులు కూడా ఉన్నతస్థాయిలో ఉన్నారని, తల్లిదండ్రులు పిల్లలకు మాతృభాషను దూరం చేయవద్దని జస్టిస్ ఎన్వీ రమణ కోరారు.






