ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మండవ కిరణ్మయి ప్రమాణం.. హాజరైన పలువురు ప్రముఖులు

by Kema Shiva Kumar |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు శాశ్వతా న్యాయమూర్తులుగా ఇటీవలే జస్టిస్ మండల కిరణ్మయి (Justice Mandal Kiranmayi)తో పాటు జస్టిస్‌ నూనెపల్లి హరినాథ్, జస్టిస్‌ జగడం సుమతి, జస్టిస్‌ న్యాపతి విజయ్‌ నియమితులైన విషయం తెలిసిందే.

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మండవ కిరణ్మయి ప్రమాణం.. హాజరైన పలువురు ప్రముఖులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు శాశ్వతా న్యాయమూర్తులుగా ఇటీవలే జస్టిస్ మండల కిరణ్మయి (Justice Mandal Kiranmayi)తో పాటు జస్టిస్‌ నూనెపల్లి హరినాథ్, జస్టిస్‌ జగడం సుమతి, జస్టిస్‌ న్యాపతి విజయ్‌ నియమితులైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆగస్టు 8న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి జగన్నాథ్‌ శ్రీనివాసన్‌ (Jagannath Srinivasan) నోటిఫికేషన్‌ కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఏపీ హైకోర్టు శ్వాశ్వత న్యాయమూర్తిగా మండవ కిరణ్మయి ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో చీఫ్ జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు.

కాగా, జస్టిస్‌ కిరణ్మయి, హరినాథ్, సుమతి, విజయ్‌లు 2023 అక్టోబర్‌ 21న హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. అయితే వారి పదవీ కాలం అక్టోబర్‌ 20న ముగియనుంది. ఈ నేపథ్యంలోనే వారిని హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈ పరిణామంతో హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తుల సంఖ్య మొత్తం 24కి చేరింది.

Next Story