ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజేగా జస్టిస్ లీసా గిల్.. ప్రతిపాదించిన కొలీజియం

by Kema Shiva Kumar |

ఏపీ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్‌ను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.

ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజేగా జస్టిస్ లీసా గిల్.. ప్రతిపాదించిన కొలీజియం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానానికి కొత్త సారథి రాబోతున్నారు. హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (Chief Justice) జస్టిస్ లీసా గిల్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆమె పంజాబ్-హర్యానా హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు. అయితే, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తులు రిటైర్ అవ్వడానికి రెండు నెలల ముందే వారి వారసులను ఖరారు చేయాలని కొలీజియం నిర్ణయించింది. న్యాయపాలనలో జాప్యాన్ని నివారించేందుకు ఈ సరికొత్త విధానాన్ని అమలు చేస్తోంది. మద్రాస్ హైకోర్టు సీజేగా జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారిని కొలీజియం సిఫారసు చేసింది. జస్టిస్ లీసా గిల్ 2014 నుంచి చండీగఢ్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. ఆమె నియామకానికి కేంద్రం ఆమోద ముద్ర వేస్తే, ఏపీ హైకోర్టుకు ఆమె పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడతారు.

Next Story