- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణం.. తొలి మహిళగా రికార్డు
ఏపీ హైకోర్టు చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించబడింది. హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ (Justice Lisa Gill) ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ఆవరణలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ (Dheeraj Singh Thakur) ఆమెతో ప్రమాణం చేయించారు. కాగా, సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు పంజాబ్-హర్యానా ఉమ్మడి హైకోర్టు నుంచి జస్టిస్ లిసా గిల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వుల అనంతరం ఆమె నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్ జనరల్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు సీనియర్ న్యాయవాదులు హాజరై ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
జస్టిస్ లిసా గిల్ రాకతో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య మరింత పెరిగింది. ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పదవీ విరమణ అనంతరం ఏపీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.






