- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీవీకే విజయ్ ఎఫెక్ట్.. హాట్ టాపిక్‌గా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ
తమిళనాడు రాజకీయాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సృష్టించిన ప్రకంపనలు ఇప్పుడు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి....

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు(Tamilnadu) రాజకీయాల్లో విజయ్(Vijay) నేతృత్వంలోని టీవీకే పార్టీ(Tvk Party) సృష్టించిన ప్రకంపనలు ఇప్పుడు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ(Telangana)ల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీఆర్ (Junior Ntr) రాజకీయ అరంగేట్రంపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
విజయ్ కంటే పెద్ద స్థాయిలో తారక్ ప్రభావం
తమిళనాడులో విజయ్‌కు ఉన్న మాస్ ఇమేజ్, క్రేజ్ అతడిని రాజకీయాల్లోకి నడిపించాయి. అదే స్థాయిలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని ప్రజాకర్షణ ఉన్న నాయకుడు తారక్ అని అభిమానుల నమ్మకం. తన తాత, దివంగత నందమూరి తారకరామారావు (NTR) స్థాపించిన తెలుగుదేశం పార్టీకి తారక్ సరైన వారసుడని, ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఆ లెగసీని కాపాడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒకవేళ తారక్ రాజకీయాల్లోకి వస్తే, విజయ్ కంటే పెద్ద స్థాయిలో ప్రభావం చూపుతారని భావిస్తున్నారు.
ప్రస్తుతం సినిమాలకే పరిమితం
రాజకీయాలపై ఇన్ని చర్చలు జరుగుతున్నా, తారక్ తన వైఖరిని ఎప్పుడూ చాలా స్పష్టంగా చెబుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన తన పూర్తి సమయాన్ని, శక్తిని సినిమాలకే కేటాయించారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తారక్, పాన్-ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. గతంలో ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. “నాకు ఓట్లు అవసరం లేదు.. అభిమానులు నా సినిమా టిక్కెట్లు కొంటే చాలు’’ అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
ఎప్పుడు వచ్చినా ప్రభంజనమే..
అయితే ఎన్టీఆర్ ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చినా అదొక ప్రభంజనం అవుతుందనడంలో సందేహం లేదు. కానీ, అది ఎప్పుడు? ఎలా? అనేది కేవలం ఆయన నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. విజయ్ విజయం చూసి అభిమానులు ఉత్సాహపడుతున్నా తారక్ మాత్రం తన కెరీర్‌లో అత్యున్నత శిఖరాలను అధిరోహించే పనిలో ఉన్నారు. రాజకీయ ప్రవేశం అనేది ఇప్పట్లో జరిగే పని కాకపోయినా, తెలుగు రాజకీయాల్లో ఆయన పేరు ఎప్పుడూ ఒక సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గానే ఉంటుంది.






