Kidnap Case: కస్టడీలో బెదిరించారా..?: వల్లభనేని వంశీకి జడ్జి సంచలన ప్రశ్నలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-02-27 12:09:45  IST  )

పోలీస్ కస్టడీ విషయంలో వల్లభనేని వంశీకి జడ్జి సంచలన ప్రశ్నలు వేశారు...

Kidnap Case: కస్టడీలో బెదిరించారా..?: వల్లభనేని వంశీకి జడ్జి సంచలన ప్రశ్నలు
X

దిశ, వెబ్ డెస్క్: గన్నవరం టీడీపీ కార్యాలయం ఉద్యోగి సత్యవర్ధన్(Gannavaram TDP office employee Satyavardhan) కిడ్నాప్, బెదిరింపుల కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Former MLA Vallabhaneni Vamsi)కి మూడు రోజుల కస్టడీ ముగిసింది. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించి వంశీని పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. మెడికల్‌ రిపోర్టులు సమర్పించారు.

అయితే ఈ సందర్భంగా వంశీకి జడ్జి పలు ప్రశ్నలు సంధించారు. కస్టడీ(Custody)లో పోలీసులు ఇబ్బంది పెట్టారా అని అడిగారు. అలాగే మరికొన్ని ప్రశ్నలు కూడా వేశారు. అయితే ఇందుకు వంశీ సమాధానమిస్తూ ఈ కేసుతో తనకు సంబంధం లేదని తెలిపారు. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, వేరే బ్యారక్‌లో వసతి కల్పించాలని కోరారు. ఒక్కడినే కాకుండా మిగతా ఖైదీలతో కలిపి ఉంచాలని విజ్ఞప్తి చేశారు. అయితే మెమో దాఖలు చేయాలని వంశీకి జడ్జి సూచించారు. రిమాండ్ కొనసాగింపులో భాగంగా వంశీని విజయవాడ సబ్ జైలు(Vijayawada Sub Jail)కు పోలీసులు తరలించారు.

కాగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీపై ఆరోపణలు ఉన్నాయి. కోర్టులో విచారణ సందర్భంగా సత్యవర్ధన్ కేసు వాపస్ తీసుకున్నారు. దీంతో సత్యవర్ధన్ తమ్ముడు విజయవాడ కృష్ణలంక పోలీసులను ఆశ్రయించి వల్లభనేని వంశీ అనుచరులు కిడ్నాప్ చేసి బెదిరించడంతో కేసును సత్యవర్ధన్‌ వెనక్కి తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులకు పలు కీలక ఆధారాలు లభించాయి. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే కేసులో మరింత విచారణ కోసం మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరడంతో అనుమతించింది. ఈ మేరకు వంశీని మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. కస్టడీ ముగియడంతో కోర్టులో ప్రవేశపెట్టారు.

Next Story