బొబ్బిలి సబ్ జైలుకు జర్నలిస్ట్ కేవీఆర్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-02 10:48:52  IST  )

ఏపీ ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హైదరాబాద్‌లో అరెస్టైన జర్నలిస్టు కేవిరెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను పోలీసులు బొబ్బిలి సబ్ జైలుకు తరలించారు....

బొబ్బిలి సబ్ జైలుకు జర్నలిస్ట్ కేవీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హైదరాబాద్‌లో అరెస్టైన జర్నలిస్టు కేవిరెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను పోలీసులు బొబ్బిలి సబ్ జైలుకు తరలించారు. అయతే ఆయన్ను ఇంతకమునుపే అరెస్ట్ చేయాల్సింది ఉంది. కొన్ని కారణాల కోర్టు నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ తీసుకున్న విజయనగరం జిల్లా బాడంగి పోలీసులు.. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని నివాసంలో కేవిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేవీరెడ్డిని అరెస్ట్ చేస్తుండగా ఆయన భార్యతో పాటు స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే స్థానిక పోలీసుల సాయంతో కేవీఆర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్‌పై కేవీరెడ్డిని విజయనగరం జిల్లా బాడంగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో కేవీరెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది.

Next Story