Ap: జైలు నుంచి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు విడుదల

by Vemula.Srinu Prasad |

గుంటూరు జిల్లా జైలు నుంచి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు విడుదల అయ్యారు...

Ap: జైలు నుంచి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు(Senior journalist Kommineni Srinivasa Rao) గుంటూరు జిల్లా జైలు(Guntur District Jail) నుంచి విడుదల అయ్యారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయనకు సుప్రీంకోర్టు(Supreme Court) బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో జైలు నుంచి ఆయన తాజాగా విడుదల అయ్యారు. కాగా బెయిల్ మంజూరు సమయంలో కొమ్మినేనికి సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది. మహిళలను కించపర్చేలా మరోసారి చేయొద్దని తెలిపింది. అలాగే ఆయనపై పోలీసులు పెట్టిన పలు సెక్షన్లపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. వెంటనే ఆ సెక్షన్లు తొలగించాలని, ఇక బెయిల్ కు సంబంధించి అన్ని విషయాలు ట్రయల్ కోర్టు చూసుకుంటుందని ధర్మాసనం తెలిపింది. అయితే జర్నలిస్టు కొమ్మినేనిపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారని వైసీపీ నాయకులు ఆరోపణలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story