జర్నలిస్ట్ ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో కలకలం

by Vemula.Srinu Prasad |

తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డ్‌కు చెందిన జర్నలిస్ట్ శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. సెల్ఫీ వీడియో తీసుకుని సీనియర్ జర్నలిస్ట్ ఉర్ల బాలకృష్ణ వర్ధన్ (36) తన నివాసంలో ఫ్యాన్‌కి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు..

జర్నలిస్ట్ ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో కలకలం
X

దిశ, తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డ్‌కు చెందిన జర్నలిస్ట్ శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. సెల్ఫీ వీడియో తీసుకుని సీనియర్ జర్నలిస్ట్ ఉర్ల బాలకృష్ణ వర్ధన్ (36) తన నివాసంలో ఫ్యాన్‌కి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటన స్థలానికి చేరుకొని పట్టణ సీఐ బోణం ఆదిప్రసాద్, ఎస్సై బాదం శ్రీనివాస్ దర్యాప్తు చేపట్టారు. మృతుని సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు నమోదు చేస్తామని తాడేపల్లిగూడెం పోలీసులు చెప్పారు. జర్నలిస్ట్ వర్ధన్ మృతికి కారణమైన వారిని శిక్షించాలంటూ దళిత సంఘ నాయకులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో అనుమానితులు తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు , యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు తమ్మిశెట్టి రంగ సురేష్, శివ పరారయ్యారు. పరారీలో ఉన్న నిందితులు తమ్మిశెట్టి రంగసురేష్ , శివ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు తెలుస్తోంది. నిందితులపై పలు సెక్షన్ల కింద తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story