- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జోగి రమేశ్ కు నవంబరు 13 వరకు రిమాండ్
మాజీ మంత్రి జోగి రమేశ్ (Jogi Ramesh) ను ఆదివారం అరెస్టు చేసిన విషయం విదితమే.

దిశ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి జోగి రమేశ్ (Jogi Ramesh) ను ఆదివారం అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆయన్ను న్యాయ స్థానంలో హాజరుపరిచారు. కేసును విచారించిన కోర్టు నవంబరు 13 వరకు జోగి రమేశ్ కు రిమాండ్ విధించింది. ఆయనతో పాటు ఆయన సోదరుడు జోగి రాముకు కూడా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు జోగి రమేశ్, రామును విజయవాడ (Vijayawada) జైలుకు తరలించారు.
పోలీసులు జోగి రమేశ్ ను ఆదివారం అరెస్టు చేశారు. తూర్పు ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో 12 గంటల పాటు విచారించారు. జోగి రమేశ్ ను, ఆయన సోదరుడు రామును సిట్ (SIT) అధికారులు వేర్వేరుగా ప్రశ్నించారు. కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడైన జనార్దన రావుతో గల సంబంధాలపై కూపీ లాగేందుకు ప్రశ్నల వర్షం కురిపించారు. అనంతరం వైద్య పరీక్షలను నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు. ఆదివారం అర్థరాత్రి వాదనలు ప్రారంభం కాగా సోమవారం ఉదయం 5గంటలకు పూర్తయ్యాయి. ఈ మేరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.






