మొత్తం మీరే చేశారు: చంద్రబాబు, లోకేశ్‌పై విరుచుకుపడ్డ జోగి రమేశ్

by Vemula.Srinu Prasad |

నకిలీ మద్యం వ్యవహారంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై జోగి రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు...

మొత్తం మీరే చేశారు: చంద్రబాబు, లోకేశ్‌పై విరుచుకుపడ్డ జోగి రమేశ్
X

దిశ, వెబ్ డెస్క్: నకిలీ మద్యం కేసు(Fake liquor Case) వ్యవహారంలో నిందితుడు జనార్ధన్ రావుతో తన పేరు చెప్పించారని, ఇదంతా చంద్రబాబు, లోకేశ్‌ చేసిన కుట్రేననని మాజీ మంత్రి జోగి రమేశ్(Former Minister Jogi Ramesh) అన్నారు. నకిలీ మద్యం కేసుకు సంబంధించిన తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన స్పందించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో జోగి రమేశ్ మాట్లాడుతూ ములకలచెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో నిందితులు జనార్ధన్ రావు, జయచంద్రారెడ్డి ఏ పార్టీ వారని ప్రశ్నించారు. తంబళ్లపల్లి నుంచి జయచంద్రారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయాలని టికెట్ ఇచ్చారా లేదా నిలదీశారు. జనార్ధన్ రావుతో తన పేరును చెప్పించారని ఆరోపించారు. తనను జైలుకు పంపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఈ కేసులో ఏ విచారణకైనా సిద్ధమేనని చెప్పారు. జనార్ధన్ రావు, జయచంద్రారెడ్డి స్నేహితులని తమరే చెబుతున్నారని, రెడ్ కార్పేట్ వేసి ఒకరిని అరెస్ట్ చేశారని, మరొకరికి ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. కస్టడీలో ఉన్న జనార్ధన్ రావు వీడియో ఎలా బయటకు వచ్చిందని నిలదీశారు. కుట్ర పన్ని తన పేరును చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

తాను ఏ తప్పు చేయలేదని భగవద్గీతపై ప్రమాణం చేస్తానని, అవసరమైతే చంద్రబాబు ఇంటికి కూడా వెళ్తానని జోగ రమేశ్ పేర్కొన్నారు. లై డిటెక్టర్ టెస్టుకైనా తాను సిద్ధంగా ఉన్నానని ధైర్యంగా, దమ్ముగా చెబుతున్నానని జోగి రమేశ్ తెలిపారు. రాష్ట్రంలో వ్యవస్థలను నాశనం చేస్తున్నారని, ప్రభుత్వం దిగజారిపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో నారా వారి నకిలీ మద్యం రాష్ట్రవ్యాప్తంగా సరఫరా అవుతోందన్నారు. గ్రామాల్లో నీటి కుళాయిలకు కంటే బెల్ట్ షాపులే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. కల్తీ సారాతో ప్రజల ఆరోగ్యాన్ని నట్టేటముంచుతున్నారని జోగి రమేశ్ వ్యాఖ్యానించారు. లిక్కర్ మంత్రి కొల్లు రవీంద్ర నిక్కర్ మంత్రి అయ్యారని విమర్శించారు. లిక్కర్ మంత్రి చంద్రబాబు లేవమంటే లేస్తారని, కూర్చోమంటే కూర్చుంటారని జోగి రమేశ్ విమర్శించారు.

Next Story