- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్ : కల్తీ మద్యం (Fake Liquor) కేసులో జోగి సోదరులకు (Jogi Brothers) కొంత ఊరట లభించింది. జోగి రమేశ్, జోగి రామును విజయవాడ కోర్టులో (Vijayawada Court) అధికారులు మంగళవారం హాజరుపరిచారు. వారి బెయిల్ పిటిషన్ (Bail Petition) పై కోర్టు విచారణ జరిపింది. ఈ క్రమంలో జోగి రమేశ్, జోగి రాముకు బెయిల్ ను మంజూరు చేసింది. భవానీపురం (Bhavanipuram) ఎక్సైజ్ పోలీసు స్టేషనులో నమోదైన కేసులో బెయిల్ విచారణను కోర్టు చేపట్టగా.. ఆ కేసులో జోగి సోదరులకు బెయిల్ మంజూరయ్యింది. ప్రస్తుతం వారు విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే మొలకలచెరువుకు సంబంధించిన కేసులో జోగి రమేశ్ రిమాండ్ లోనే ఉన్నారు. ఆ కేసులో ఇంకా బెయిల్ మంజూరు కాలేదు. కేసుకు సంబంధించిన వాదనలు తంబళ్లపల్లి కోర్టులో కొనసాగుతున్నాయి. ప్రస్తుత పరిణామాలపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో పలుమార్లు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినప్పటికీ జోగి సోదరులకు చుక్కెదురైంది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా వారికి కొంత ఊరట లభించినట్లైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.






