Nara lokesh: ఏటా వెయ్యిమందికి ఆ దేశంలో ఉద్యోగాలు

by Thanuru Gopichand |

రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, ఏఎన్ఎం విద్యనభ్యసించే విద్యార్థినులకు జర్మనీ, ఐరోపా దేశాల్లో ఉద్యోగావకాశాలు లభించేలా శిక్షణ ఇప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ , స్కిల్ బి నడుమ అవగాహన ఒప్పందం కుదిరింది.

Nara lokesh: ఏటా వెయ్యిమందికి ఆ దేశంలో ఉద్యోగాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, ఏఎన్ఎం విద్యనభ్యసించే విద్యార్థినులకు జర్మనీ, ఐరోపా దేశాల్లో ఉద్యోగావకాశాలు లభించేలా శిక్షణ ఇప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (Ap skill development corporation), స్కిల్ బి నడుమ అవగాహన ఒప్పందం కుదిరింది.మంత్రి లోకేశ్(nara lokesh) సమక్షంలో ఇరుపక్షాలు ఎంవోయూపై సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. జర్మనీలో వృద్ధుల సంరక్షణ, హాస్పిటల్స్‌లో 3 లక్షల మంది నర్సింగ్ అభ్యర్థుల కొరత ఉందని తెలిపారు. ఏపీలోని నర్సింగ్ విద్యార్థినులకు జర్మన్ భాషలో (german language) నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా ప్రతి ఏటా వెయ్యిమందికి జర్మనీలో అత్యుత్తమ ప్యాకేజితో ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. స్కిల్ బి (Skillbee) ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కో ఫౌండర్ వింజమూరి రవిచంద్రగౌతమ్, సీఈవో ఉజ్వల్ చౌహాన్ మాట్లాడుతూ.. తమ సంస్థ ఆధ్యర్యంలో ఇప్పటివరకు 10వేల మందికిపైగా విదేశాల్లో ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. స్కిల్ బీ అంతర్జాతీయస్థాయి అత్యుత్తమ రిక్రూట్‌మెంట్ స్టార్టప్‌లలో ఒకటిగా ఉందని తెలిపారు. జర్మనీ, పోలాండ్, హంగేరీ, లిథువేనియా, లాట్వియా, ఇతర తూర్పు ఐరోపా దేశాలకు తమ సంస్థ ద్వారా అభ్యర్థులను రిక్రూట్ చేస్తున్నామని అన్నారు.రాష్ట్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు, విశాఖపట్నంలోని ప్రైవేటు నర్సింగ్ కళాశాలలు, ఉమ్మడి తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లోని 4 వేలమందికి పైగా నర్సింగ్ (nursing students) విద్యార్థులకు స్కిల్ బీ ద్వారా జర్మన్ భాషలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

Next Story