- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువతకు ఇజ్రాయిల్ లో ఉద్యోగ అవకాశాలు
యువతకు ఇజ్రాయిల్ లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని జిల్లా ఉపాధి అధికారి ఎం. క్రిస్టీ అభినవ్ గురువారం తెలిపారు.

దిశ ప్రతినిధి, గుంటూరు: యువతకు ఇజ్రాయిల్ లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని జిల్లా ఉపాధి అధికారి ఎం. క్రిస్టీ అభినవ్ గురువారం తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఇతర సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఇజ్రాయెల్ దేశంలో హోం బేసెడ్ కేర్ గివర్ ఇన్ ఇజ్రాయెల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. 25, 45 సంవత్సరాలు మధ్య వయస్సు గల పురుష, మహిళ అభ్యర్థులు ఈ అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జి.డి.ఎ/ ఏ.ఎన్.ఎం/జి.ఎన్.ఎం/ బి.ఎస్సీ నర్సింగ్/ పోస్ట్ బి.ఎస్సీ నర్సింగ్ విద్యార్హత కలిగి ఉండి, ఇంగ్లీష్ (కమ్యూనికేషన్ స్కిల్స్, భాషా నైపుణ్యం కలిగిన వారు అర్హులన్నారు. రెండు సంవత్సరాలకు కాంట్రాక్ట్ ఒప్పందం ఉంటుందని చెప్పారు. నెలకు దాదాపు రూ.1,99,770 వేతనం ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు రూ.2.10 లక్షలు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని తెలిపారు. ఆన్లైన్ లో ఇంటర్వ్యూ ఉంటుందని అన్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు సంబంధిత వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, దరఖాస్తును [email protected] కు కూడా పంపించాలని చెప్పారు. వివరాలకు 9988853335, 8712655686, 8790118349, 8790117279 నెంబర్లకు సంప్రదించవచ్చని చెప్పారు.






