- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nara Lokesh:‘8 వేల మందికి ఉద్యోగ అవకాశాలు’.. మంత్రి కీలక ప్రకటన
ఏపీ(Andhra Pradesh)లోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధే(State Development) లక్ష్యంగా దూసుకెళ్తుంది.

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధే(State Development) లక్ష్యంగా దూసుకెళ్తుంది. ఈ తరుణంలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ కాకినాడ(Kakinada)లో ఏర్పాటు కానుందని రాష్ట్ర విద్యా, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పెట్టుబడుల వివరాలను వెల్లడించారు. ఏఎం గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్లాంట్ ఏర్పాటుతో 8 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏడాదికి 1.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి అయ్యే గ్రీన్ అమోనియాను జర్మినీ, సింగపూర్, జపాన్ కు ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు.
Next Story






