- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ అప్డేట్
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ అప్డేట్

దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు మంత్రి నారా లోకేష్(Nara Lokesh) గుడ్ న్యూస్ చెప్పారు. జాబ్ క్యాలెండర్ అప్డేట్ ఇచ్చారు. వచ్చే ఏడాది జనవరిలో తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించారు. రాజమండ్రిలో 'హలో లోకేశ్'లో భాగంగా ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. గ్రాడ్యుయేషన్ తర్వాత కూడా యువత ఉద్యోగాలు పొందేందుకు ఇబ్బందులు పడుతోందని.. ఇందుకు విద్యతో పరిశ్రమలను అనుసంధానించాలని అభిప్రాయపడ్డారు. ఐదేళ్లలో అన్ని రంగాల్లో కలిపి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. రాజమండ్రిలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీని సందర్శించిన లోకేష్.. యూనివర్సిటీలో రూ.34 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన మూడు భవనాలను ప్రారంభించారు. మంజీరా బ్లాక్ పేరుతో నూతనంగా నిర్మించిన ఎగ్జామినేషన్ బిల్డింగ్, గౌతమి బ్లాక్ పేరుతో నిర్మించిన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇంద్రావతి బ్లాక్ పేరుతో నిర్మించిన స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్ మెంట్ స్టడీస్ భవనాలను ప్రారంభించి... విద్యార్థులతో మాట్లాడి వారి ఆలోచనలు తెలుసుకున్నారు.






