‘నేనే వైసీపీలోకి వెళ్లొచ్చు’.. జేసీ ప్రభాకర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-01 13:30:55  IST  )

తాడిపత్రిలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది.

‘నేనే వైసీపీలోకి వెళ్లొచ్చు’.. జేసీ ప్రభాకర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
X

దిశ,వెబ్‌డెస్క్: తాడిపత్రిలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగు పెట్టనివ్వమని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మరోసారి మాటల యుద్ధం కొనసాగుతుంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలను జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఖండించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫ్రస్టేషన్‌లో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దారెడ్డి ఇంటికి రిజిస్ట్రేషన్ కూడా లేదు. అన్ని అక్రమాలే అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు.

ఈ క్రమంలో కేతిరెడ్డి సూర్య ప్రతాప్ రెడ్డి లేకపోతే పెద్దారెడ్డి జీరో అని విమర్శించారు. గతంలో నన్ను మోటార్ వెహికల్ యాక్ట్ పెట్టి జైలుకు పంపారని ఆయన గుర్తు చేశారు. గత ఐదేళ్లు నన్ను ఇబ్బంది పెట్టారని జేసీ మండిపడ్డారు. ఈ తరుణంలో నాకు వైయస్సార్ ఫ్యామిలీతో మంచి సంబంధం ఉంది. నేనే భవిష్యత్తులో వైసీపీలోకి వెళ్లొచ్చేమో అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో నా ఆస్తులు అన్ని పోయినా బాధపడలేదు. నాకొడుకును జైల్లో పెట్టినా బాధపడలేదు. కానీ మాజీ ఎమ్మెల్యే మా ఇంటి మీదికి వచ్చినప్పుడు బాధపడ్డానని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో పెద్దారెడ్డిపై నాకు కక్ష ఉంది, ఆయినా లీగల్‌గానే వెళ్తానని ఆయన తేల్చి చెప్పారు.

Next Story