- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘తాడిపత్రికి వస్తే.. రప్పా రప్పానే’.. జేసీ ప్రభాకర్ రెడ్డి మాస్ వార్నింగ్
అనంతపురం తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది

దిశ,వెబ్‌డెస్క్: అనంతపురం తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇవాళ(ఆదివారం) తాడిపత్రికి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇప్పటికే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మా మధ్య ఎవరు వచ్చేది లేదని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెద్దారెడ్డి తాడిపత్రికి రావడంతో ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు భారీగా తాడిపత్రికి చేరుకున్నారు. దీంతో పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని బయటకు రాకుండా.. అదుపులోకి తీసుకున్నారు.
ఈ తరుణంలో మరోసారి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘నాకు వైసీపీ శత్రువు కాదు. ఒక్క పెద్దారెడ్డి మాత్రమే శత్రువు. పెద్దారెడ్డి వెంట ఎవరు నడిచినా అంతుచూస్తాం. ఫొటోలు తీస్తున్నాం. పెద్దారెడ్డికి మద్దతుగా ఉన్నవారిని వదిలిపెట్టేది లేదు. తాడిపత్రిలో పెద్దారెడ్డిని అడుగుపెట్టకుండా చేస్తాం. తాడిపత్రి పట్టణానికి ఎప్పుడు వచ్చినా మా కార్యకర్తలు రప్పా రప్పా చేస్తారు. త్వరలోనే పెద్దారెడ్డి ఇంటిని జేసీబీతో కూల్చివేస్తారు’’ అని హెచ్చరించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






