ఆ డీఎస్పీ పేరు రెడ్ బుక్‌లో ఉంది..జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్

by Ajay Maddhiboyina |

డీఎస్పీ చైత‌న్య‌ను ఎట్టిప‌రిస్థితుల్లో వ‌దిలేది లేద‌ని తాడిప‌త్రి మున్సిపల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి హెచ్చ‌రించారు. ఆయ‌న పేరు త‌మ నాయ‌కుడు లోకేష్ రెడ్ బుక్‌లో ఉందని చెప్పారు.

ఆ డీఎస్పీ పేరు రెడ్ బుక్‌లో ఉంది..జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్
X

దిశ‌, వెబ్ డెస్క్: డీఎస్పీ చైత‌న్య‌ను ఎట్టిప‌రిస్థితుల్లో వ‌దిలేది లేద‌ని తాడిప‌త్రి మున్సిపల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి హెచ్చ‌రించారు. ఆయ‌న పేరు త‌మ నాయ‌కుడు లోకేష్ రెడ్ బుక్‌లో ఉందని చెప్పారు. చైతన్య డీస్పీగా ఉండి తాడిపత్రిలో టీడీపీ నాయకులను, కార్యకర్తలను మరియు ప్రజలను వేధింపులకు గురిచేశాడని ఆరోపించారు. చైతన్య వేధింపులకు గురి చేశాడని ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామని చెప్పారు. డీఎస్పీ చైతన్యను వదిలేయాలని కాంగ్రెస్ నాయకుడు కనుమూరి బాపిరెడ్డి తనకు ఫోన్ చేశారని, కానీ చైతన్య చేసిన అక్రమాలు ఆయనకు వివరించానని అన్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డితో కలిసి తమవారిపై మోపిన తప్పుడు కేసుల గురించి వివరించానని అన్నారు. పెద్దారెడ్డి చెప్పినట్టు విని తమపై తప్పుడు కేసులు పెట్టిన అధికారిని ఎలా మర్చిపోతామని అన్నారు. తప్పు చేసిన ప్రతిఒక్కరు శిక్ష అనుభవించాల్సిందేనని చైతన్యపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story