- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
J.C. Prabhakar Reddy : తిరుమల టికెట్లు అమ్ముకుని రోజా బెంజ్ కారు కొన్నది : జే.సీ.ప్రభాకర్ రెడ్డి
J.C. Prabhakar Reddy : తిరుమల టికెట్లు అమ్ముకుని రోజా బెంజ్ కారు కొన్నది : జే.సీ.ప్రభాకర్ రెడ్డి

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ మాజీ మంత్రి రోజా(Roja) తిరుమల టికెట్ల(Tirumala Tickets) టోకెన్లు అమ్ముకుని బెంజ్ కారు కొన్నదని తాడిపత్రి మున్సిపాల్టీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జే.సీ.దివాకర్ రెడ్డి(J.C. Prabhakar Reddy) ఘాటుగా విమర్శించారు. దర్శనానికి వెళ్లిన ప్రతి సారి వందలాది మందిని తీసుకెళ్లావని..నీ కథ చెప్పాలంటే చాల ఉందన్నారు. రోజా మీద చెక్ బౌన్స్ కేసులు అనంతపురం కోర్టులో ఉన్నాయన్న సంగతి మరువరాదన్నారు.
చంద్రబాబు పుణ్యాన రాజకీయాల్లోకి వచ్చావని, నోరుందికదా అని ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడవద్దన్నారు. తప్పంతా చంద్రబాబుదేనని..మేం వైసీపీ ప్రభుత్వంలో అనేక కష్టాలు పడ్డామని, చంద్రబాబు మాత్రం వారిని గాలికి వదిలేశారన్నారు. నీవు తైతక్కలాడుకుంటూ రాజకీయాల్లోకి వచ్చి ప్రతి దానికి తగుదునమ్మా అంటూ మాట్లాడుతారని..నోరు అదుపులో పెట్టుకోవాలని రోజాకు జేసీ వార్నింగ్ ఇచ్చారు.
మాజీ సీఎం జగన్ ఫేడ్ అవుట్ అవుతున్నాడని..ఆయనకు వైసీపీలోనే శత్రువులున్నారన్నారు. తిరుమల తొక్కిసలాటపై వైసీపీ శవ రాజకీయాలు చేస్తుందన్నారు. జగన్ హయాంలో బోటు ప్రమాదం జరిగి 39 మంది చనిపోతే కనీసం పరామర్శించలేదన్నారు. పరదాలు కట్టుకుని ప్రజల ముందుకు వచ్చే జగన్.. ఇప్పుడు జనాల్లోకి రావడానికి కారణం ఆయన ఫేడ్ అవుట్ అవుతుండటమేనని విమర్శించారు.






