దీక్ష విరమించిన జేసీ ప్రభాకర్ రెడ్డి

by Ajay Maddhiboyina |

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తాడిపత్రిలో చేపట్టిన తన దీక్షను విరమించారు.

దీక్ష విరమించిన జేసీ ప్రభాకర్ రెడ్డి
X

దిశ‌, వెబ్ డెస్క్: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తాడిపత్రిలో ఒకరోజు దీక్షకు కూర్చున్న సంగతి తెలిసిందే. తాడిపత్రిలోని గాంధీ బొమ్మ సెంటర్‌లో జేసీ దీక్ష చేపట్టారు. నా ఒక్కరోజు దీక్ష ప్రజల కోసం అంటూ ప్లెక్సీని ఏర్పాటు చేశారు. కాగా దీక్షను విరమించిన అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి ప్రజలను మమేకం చేయడానికే తాను దీక్ష చేశానని చెప్పారు.

అన్ని మున్సిపాలిటీలు చెత్త ఎక్కడికి తరలించాలో తెలియక ఇబ్బంది పడుతున్నాయని కానీ తాడిపత్రిలో అలాంటి ఇబ్బందులు లేవన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లు చెత్త తరలించకపోవడం వల్ల ఇబ్బంది పడ్డామని చెప్పారు. తాడిపత్రి మున్సిపాలిటీ ఆస్తులు, ఖర్చులు, వాహనాల గురించి ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే దీక్ష చేశానని అన్నారు. అంతే కాకుండా హ్యాపీ న్యూఇయర్ అంటే కొన్ని కట్టుబాట్లు చేసుకున్నప్పుడే హ్యాపీగా ఉంటామని చెప్పారు. తన ప్రవర్తన మార్చుకోవాలని ప్రజలు చెబితే మార్చుకుంటానని వ్యాఖ్యానించారు.

Next Story