- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాడిపత్రి టీడీపీలో విభేదాలు.. సభకు వచ్చే ఆ వాహనాలు ధ్వంసం చేయండంటూ జేసీ అనుచరుల ఆడియో వైరల్
తాడిపత్రి టీడీపీలో (Tadipatri TDP) విభేదాలు బయపడ్డాయి.

దిశ, వెబ్‌డెస్క్: తాడిపత్రి టీడీపీలో (Tadipatri TDP) విభేదాలు బయపడ్డాయి. నెట్టింట జేసీ అనుచరుల వాయిస్ రికార్డు అంటూ వైరల్ అవుతున్న పోస్ట్ ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. నేడు అనంతపురంలో సూపర్ సిక్స్.. సూపర్ హిట్ (Super Six Super Hit) పేరుతో కూటమి ప్రభుత్వం భారీ బహిరంగ సభ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సభకు నియోజకవర్గం నుంచి వెళ్లే నేతలందరి కార్లపై ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, జేసీ పవన్ కుమార్, జేసీ అశ్విత్ రెడ్డిల ఫొటోలతో చేసిన స్టిక్కర్లు ఉండాలని ఆ ఆడియోలో జేసీ అనుచరులు పేర్కొన్నారు.
జేసీ బ్రాండ్ స్టిక్కర్ లేకుండా ఏ ఒక్క వాహనం కనిపించినా వాటిని ధ్వంసం చేసే అధికారం టీడీపీ కార్యకర్తలకు ఉందంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీంతో జేసీ అనుచరుల కారణంగా పార్టీలో విభేదాలు నెలకొన్నాయి. మరోవైపు సుమారు వంద వాహనాల్లో సభకు వెళ్లాలని టీడీపీ నేత కాకర్ల రంగనాథ్ ఏర్పాట్లు చేస్తున్నారు.






