Jayapradha: ఏపీలో ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తా.. నటి జయప్రద సెన్సేషనల్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2024-04-03 12:46:21  IST  )

ఏపీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలకు సేవ చేయాలని ఉందని బీజేపీ నేత, సినీనటి జయప్రద అన్నారు.

Jayapradha: ఏపీలో ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తా.. నటి జయప్రద సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలకు సేవ చేయాలని ఉందని బీజేపీ నేత, సినీనటి జయప్రద అన్నారు. ఇవాళ ఆమె తిరుమల శ్రీవారిని ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్నప్పటికీ తాను ఓ తెలుగు బిడ్డనేనని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా బీజేపీ అధిష్టానం అదేశాల మేరకు తనుకు ఏ బాధ్యత ఇచ్చిన సక్రమంగా నెరవేర్చుతానని అన్నారు. ఎవరైతే ఏపీకి శాశ్వత రాజధాని తీసుకురాగలరో, యువతకు ఉపాధి కల్పించగలరో వారికే తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే.. తాను స్టార్ క్యాంపెనింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. తనను ఆహ్వానిస్తే తప్పకుండా టీడీపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని తెలిపారు. నటుడు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ తనకు చాలా ఇష్టమని అన్నారు. టీడీపీ అధినతే చంద్రబాబునాయుడు తన అత్యంత ఆత్మీయులని వారి కుటుంబంతో తనుకు ఉన్న అనుబంధం మరువలేదని జయప్రద తెలిపారు.

Read More..

శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి,మాజీ ఎంపీ

Next Story