Jansena: పవన్ ఢిల్లీ టూర్ విమర్శలపై స్పందించిన జనసేన నేత నాగబాబు

by Ramesh Goud |   (  Updated:2024-11-29 09:50:21  IST  )

పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఢిల్లీ(Delhi Tour) వెళ్లింది రాష్ట్ర ప్రయోజనాల కోసమే తప్ప స్వార్థ ప్రయోజనాల కోసం కాదని జనసేన నేత నాగబాబు(Janasena Leader Nagababu) అన్నారు.

Jansena: పవన్ ఢిల్లీ టూర్ విమర్శలపై స్పందించిన జనసేన నేత నాగబాబు
X

దిశ, వెబ్ డెస్క్: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఢిల్లీ(Delhi Tour) వెళ్లింది రాష్ట్ర ప్రయోజనాల కోసమే తప్ప స్వార్థ ప్రయోజనాల కోసం కాదని జనసేన నేత నాగబాబు(Janasena Leader Nagababu) అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనపై వస్తున్న విమర్శల పట్ల ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడని(People Leader), అతని ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమేనని, వ్యక్తిగత స్వార్థానికి అతనెప్పుడు దూరంగానే వుంటాడని స్పష్టం చేశారు. అలాగే అతను ఎప్పుడు సత్యానికి, ధర్మానికి కట్టుబడి ఉంటాడని, మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్తాడు.. పోరాడతాడని తెలిపారు. అంతేగాక ఢిల్లీ వెళ్లిన ఉద్దేశం స్వార్థ ప్రయోజనాలకోసం కాదు, మన రాష్ట్ర ప్రయోజనాలకోసమని చెప్పారు. ఇక అలాంటి నాయకుడికోసం నా లైఫ్ ని ఇవ్వటానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటానని చెబుతూ.. నా నాయకుడికి సేవ చేయడం తప్ప నాకు వేరే రాజకీయ ఆశయం లేదని నాగబాబు వ్యాఖ్యానించారు.

Next Story