టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా... కారణం ఇదే..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-09 10:56:53  IST  )

టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు...

టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా... కారణం ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devastanam) బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి(Janga Krishna Murty) రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(TTD Chairmen Br Naidu)కు పంపారు. తనపై మీడియాలో వస్తున్న కథనాలపై తాను మనస్థాపం చెందానని, అందుకే రాజీనామా చేస్తున్నానని లేఖలో జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. అయితే జంగాకు టీటీడీ కేటాయించిన భూమిని కేబినెట్ రద్దు చేయడమే కారణమని తెలుస్తోంది. ఈ కారణంతోనే ఆయన మనస్థాపం చెందారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ప్రస్తుతం జంగా రాజీనామా చర్చనీయాంశంగా మారింది.

టీటీడీ సభ్యుడిగా జంగా కృష్ణమూర్తికి ఛాన్స్

కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ సభ్యుల నియామకంలో జంగా కృష్ణమూర్తికి సీఎం చంద్రబాబు అవకాశం కల్పించారు. అప్పటి నుంచి టీటీడీ బోర్డు సభ్యుడిగా కృష్ణమూర్తి కొనసాగుతున్నారు. అయితే గతంలో తిరుమల బాలాజీనగర్‌లో ప్లాట్ నెంబర్ 2ను జంగాకు కేటాయించారు. ఇప్పటికీ ఆ స్థలం ఖాళీగా ఉండటంతో రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జంగాకు కేటాయించిన భూమిని రద్దు చేయాలని తీర్మానించారు. దీంతో మనస్థాపం చెందిన జంగా తన టీటీడీ సభ్యత్వానికి రాజీనామా చేసి సీఎం చంద్రబాబుతో పాటు టీటీడీ చైర్మన్ బీర్ నాయుడికి పంపారు. తన రాజీనామాను ఆమోదించాలని జంగా కోరారు.

Next Story