‘డిప్యూటీ సీఎం’ పదవి పై రచ్చ.. టీడీపీకి జనసేన స్ట్రాంగ్ కౌంటర్!

by Jakkula.Mamatha |   (  Updated:2025-01-19 10:34:07  IST  )

ఏపీ రాజకీయాల్లో ఓ వార్త సంచలనంగా మారింది.

‘డిప్యూటీ సీఎం’ పదవి పై రచ్చ.. టీడీపీకి జనసేన స్ట్రాంగ్ కౌంటర్!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ రాజకీయాల్లో ఓ వార్త సంచలనంగా మారింది. నారా లోకేష్‌‌(Nara Lokesh)ను డిప్యూటీ సీఎం(Deputy CM) చేయాలంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి నిన్న(శనివారం) చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు జనసేన నేతలు ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు. జనసేన(Janasena) సోషల్ మీడియాలోనూ ఈ వ్యాఖ్యల పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే జరిగితే పవన్ కళ్యాన్‌(Pawan Kalyan)ను సీఎంగా, లోకేష్‌‌ను డిప్యూటీ సీఎంగా చేయాలని కొందరు జనసేన నేతలు కౌంటర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలో మరికొందరు జనసేన నేతలు(Janasena Leaders) చివరి రెండున్నరేళ్లు పవన్‌కు సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ కూడా తీసుకువస్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు మాత్రం మరో పదేళ్లు చంద్రబాబే(Chandrababu) సీఎంగా ఉండాలంటూ.. గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో(Social Media) జోరుగా పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈ వివాదం ముగిసిపోతుందా? లేక కూటమిలో కుంపట్లకు దారి తీస్తుందా? అన్న అంశంపై ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

Next Story