‘ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించట్లేదు’.. యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-03-12 09:26:37  IST  )

ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM pawan kalyan) పై వైసీపీ(YSRCP) నాయకురాలు, యాంకర్ శ్యామల(Anchor Shyamala) మరోసారి విమర్శలు గుప్పించారు.

‘ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించట్లేదు’.. యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM pawan kalyan) పై వైసీపీ(YSRCP) నాయకురాలు, యాంకర్ శ్యామల(Anchor Shyamala) మరోసారి విమర్శలు గుప్పించారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ఆధ్యాత్మిక స్థలాలను కూల్చివేస్తోందని ఆమె మండిపడ్డారు. ఈ క్రమంలో మతపరమైన ప్రదేశాలపై జరుగుతున్న దాడులను చూస్తూ ఊరుకోలేక ఇవాళ(బుధవారం) కాశీనాయని ఆలయాన్ని సందర్శించానని తెలిపారు.

ఈ క్రమంలో సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్(Pawan kalyan) ఎక్కడ? అని ఆమె ప్రశ్నించారు. ఆయన సొంత శాఖ అధికారులు ఆధ్యాత్మిక స్థలాలను కూలుస్తున్నా పవన్ కళ్యాణ్ స్పందించట్లేదని.. ఎందుకు నోరు మెదపడం లేదని ఆమె నిలదీశారు. ఆధ్యాత్మిక స్థలాల కూల్చివేతలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆమె పేర్కొన్నారు. ఈ తరుణంలో తన వ్యాఖ్యలు రాజకీయపరమైనవి కావని.. ఒక సామాన్యురాలిగానే తాను స్పందిస్తున్నానని శ్యామల వెల్లడించారు.

Next Story