- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'దరిద్ర పుత్రుడు సీఎం జగన్'.. జనసేన పార్టీ నేత సెటైర్లు
ఈ రాష్ట్రం నెత్తిమీద జేష్ఠ దేవిని కూర్చోబెట్టిన దరిద్ర పుత్రుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేశ్ అన్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఈ రాష్ట్రం నెత్తిమీద జేష్ఠ దేవిని కూర్చోబెట్టిన దరిద్ర పుత్రుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేశ్ అన్నారు. బటన్ నొక్కి రాష్ట్రాన్ని సంక నాకిం చేశారని మండిపడ్డారు. పగలు రాత్రి తేడా లేకుండా సీఎం జగన్ బందిపోటు ముఠా రాష్ట్రాన్ని ఇష్టానుసారం దోచుకుంటున్నారని ఆరోపించారు. విజయవాడలో పోతిన వెంకట మహేశ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో అభివృద్ధిలో కాదు..అప్పులు, క్రైమ్ రేట్‌లో నెంబర్ వన్ అయిందని విమర్శించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పరిశ్రమలు లేకుండా ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో సమాధానం చెప్పాలని నిలదీశారు. సీఎం జగన్‌కు దమ్ముంటే ఈ రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు పెట్టుబడులు, ఉద్యోగాలు, ఉపాధి వంటి రంగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
- Tags
- janasena party
Next Story






